మెగాహీరో వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా 'రంగరంగ వైభవంగా'. ఇందులో 'తెలుసా తెలుసా' అంటూ సాగే లిరికల్ గీతాన్ని గురువారం రిలీజ్ చేశారు. ఆద్యంతం మెలోడీతో సాగుతున్న ఈ పాట.. శ్రోతల్ని అలరిస్తోంది.
ఈ సినిమాలో వైష్ణవ్, డాక్టర్‌గా కనిపించనున్నట్లు పాట చూస్తే అర్థమవుతోంది. అతడి సరసన కేతికశర్మ హీరోయిన్గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, గిరీశయ్య దర్శకత్వం వహించారు.
FIR trailer: విష్ణు విశాల్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం 'ఎఫ్ఐఆర్'. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో నాని, గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆద్యంతం థ్రిల్లింగ్ ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.