వివాదస్పద నటి పూనమ్ పాండేపై మరో కేసు నమోదైంది. ఆమె ఇటీవల గోవాలో ఓ వీడియో కోసం చిత్రీకరణలో పాల్గొనగా, అదే ప్రాంతానికి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ సదరు మహిళా సంఘం ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటే మరో కేసు కూడా నమోదైంది. వీటిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.