తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bollywood: బాలీవుడ్​ నటిపై ఎఫ్​ఐఆర్ నమోదు - స్వరా భాస్కర్​ ట్వీట్ వైరల్​

బాలీవుడ్​ నటి స్వరా భాస్కర్​పై(SwaraBhaskar) ఎఫ్​​ఐఆర్​ నమోదైంది. ఆమె ఇటీవల చేసిన ఓ ట్వీట్​ మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ కొంతమంది ఆమెపై ఫిర్యాదు చేశారు.

swara bhaskar
స్వరా భాస్కర్​

By

Published : Jun 17, 2021, 10:18 AM IST

వివాదస్పద ట్వీట్లు చేసి నిత్యం నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యే బాలీవుడ్​ నటి స్వరా భాస్కర్​(SwaraBhaskar) మరోసారి చిక్కుల్లో పడింది. ఆమె ఇటీవల చేసిన ఓ ట్వీట్​ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో స్వరపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. ఆ ట్వీట్​లో ఆమె ఇటీవల జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించింది. అందులో ఓ మతం వారిని దోషులుగా ఉద్దేశిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

స్వరాభాస్కర్​ ట్వీట్​

"ట్వీట్లు వారి వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచేలా లేవు. మత సమూహాల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయి. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఇలాంటి ట్వీట్లకు సెలబ్రిటీలే బాధ్యత వహించాలి" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలోనూ స్వర వివాదస్పద ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొంది. ఆమె 'గుజారిష్'​, 'తను వెడ్స్​ మను', 'ఔరంగజేబ్'​, 'ది స్టోరీ' వంటి పలు హిట్​ చిత్రాలు సహా వెబ్​సిరీస్​ల్లో నటించింది. చివరిసారిగా 'భాగ్​ బీని భాగ్' సిరీస్​లో కనిపించింది. ప్రస్తుతం 'షీర్​ కోర్మా' సినిమాలో నటిస్తోంది. దీనిని ఫరాజ్​ అరీఫ్​ అన్సారీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆంటీ' అన్నందుకు 4 ఏళ్ల బాలుడిపై 'స్వర' పురాణం

ABOUT THE AUTHOR

...view details