తన గాత్రంతో మైమరిపించి కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర గంధర్వుడు బాలు స్వర్గపురికి చేరారు. తమిళనాడు తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో బాలుకు తుది వీడ్కోలు పలికారు.
అశ్రునయనాలతో బాలుకు అంతిమ వీడ్కోలు - ఎస్పీ బాలు వార్తలు
తమిళనాడు తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
బాలు
బాలు చివరి చూపు కోసం వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు. ఆయన అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై నివాళులర్పించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.
Last Updated : Sep 26, 2020, 3:50 PM IST