ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం '99 సాంగ్స్'. ఇహాన్ భట్, ఎడిల్సీ నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. తెలుగులో హీరో పాత్రకు నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఏప్రిల్ 16న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి రెహ్మాన్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు.
"ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే చిత్రసీమపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ విజయం మొత్తం చిత్రసీమదిగా భావిస్తారు. ప్రజలు చిత్రనిర్మాతలను ప్రోత్సహించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఒక సినిమా చతికిల పడితే ఈ రంగంపై జీవనోపాధి పొందుతున్న వారు తమ ఉపాధిని కోల్పోతారు. కొంతమందయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు ధైర్యంగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రేక్షకులు మాస్కులు ధరించి, అన్నీ జాగ్రత్తలు తీసుకొని వస్తారని, సురక్షితంగా ఉంటూ సినిమాను ఆస్వాదించాలని ఆశిస్తున్నా."