తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నీట్​గా టక్కులేస్తున్న హీరోలు.. ఆఫీసర్ ఆన్ డ్యూటీ! - republic movie

చిరిగిపోయిన జీన్‌ ప్యాంట్‌, చిందరవందరగా కనిపించే జుట్టు ఇలా మన హీరోలు ఎంత రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించేవాళ్లో. హీరోయిజం అంటే అదేనేమో.. మాస్‌ ఇమేజ్‌ అంటే ఇంతేనేమో అన్నట్టుగా పాత్రలు రూపుదిద్దుకొనేవి. ఇప్పుడు స్టైల్‌ మారింది. హీరోలు నీటుగా టక్కులేస్తున్నారు. క్లాస్‌గా కార్యాలయాల్లో ఫైళ్లు తిరగేస్తూ అధికారుల పాత్రల్లోనూ ఒదిగిపోతున్నారు.

acharya movie
ఆచార్య మూవీ

By

Published : Aug 11, 2021, 8:11 AM IST

కథల్లో మాస్‌ మసాలా అంశాల ఉద్ధృతి పెరిగాక హీరోయిజం తీరుతెన్నులే మారిపోయాయి. తెరపై రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తేనే హీరో అంటారేమో అన్నట్టుగా పాత్రలు రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. కథలో హీరో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. కాసేపైనా పరమ పోకిరిగా కనిపించాల్సిందే అన్నట్టుగా పాత్రల్ని మలచడం అలవాటు చేసుకున్నారు దర్శకులు. అంతకుముందు వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా అలా కొన్నాళ్లపాటు ట్రెండ్‌ కొనసాగింది.

రూటు మారింది..

ఆర్డీవోగా..

ఈమధ్య మళ్లీ రూటు మారింది. ప్రేక్షకులు రియలిస్టిక్‌ కథల్ని ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టే హీరో పాత్రల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పటిలా అల్లరి చిల్లరిగా కాకుండా.. హీరోల పాత్రల్ని నీటుగా సూటూ బూటూతో ముస్తాబు చేసి క్లాస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకులు. ఆ పాత్రలతోనే మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు మాస్‌ హీరోలు.. యువ హీరోలు త్వరలోనే ప్రభుత్వ అధికారుల పాత్రలతో సందడి చేయనున్నారు.

అధికారుల పాత్రల్లో..

నీట్​గా టక్​ వేసి..

స్టార్‌ హీరో సినిమా అంటే హీరోయిజం ఓ స్థాయిలో పండాల్సిందే. అందుకే మాస్‌ మసాలా అంశాల్ని జోడించిన కథ, పాత్రల్లోనే వాళ్లని చూపించడానికి ఇష్టపడుతుంటారు దర్శకులు. ఆ తరహా అంశాలు ఎక్కువగా పోలీస్‌ కథలతోనే సాధ్యం కాబట్టి స్టార్‌ హీరోలు తరచూ పోలీస్‌ అధికారుల పాత్రల్లో సందడి చేస్తుంటారు. కార్యాలయాల్లో కూర్చుని, ఫైళ్లు తిరగేసే అధికారుల పాత్రల్లో వాళ్లని చూడటం చాలా అరుదు. అయితే ఈసారి అలాంటి పాత్రలు చాలానే సిద్ధమయ్యాయి. రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్‌ డ్యూటీ' రూపొందుతోంది. ఇందులో రవితేజ ఆర్డీవోగా కనిపిస్తారని సమాచారం. ఆ పాత్రతోనే ఆయన హీరోయిజం పండించనున్నారు. 90వ దశకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అలాగే యువ కథానాయకుడు సాయి తేజ్‌ 'రిపబ్లిక్‌'లో యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ కథలో కొల్లేటి నేపథ్యమూ ఉంటుందని సమాచారం. 'టక్‌ జగదీష్‌'గా నాని త్వరలోనే సందడి చేయనున్నారు. ఆయనా ఈ సినిమాలో ఓ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని తెలిసింది. టక్కుతో కనిపిస్తూనే.. ఇందులో 'మ మ మాస్‌' అనిపించనున్నారని ప్రచార చిత్రాల్ని బట్టి స్పష్టమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఐఏఎస్​ అధికారిగా..

చిరు కూడా..

'ఆచార్య'లో చిరంజీవి దేవాదాయ శాఖకి సంబంధించిన ఓ అధికారి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. కొరటాల శివ సినిమాలో హీరో క్లాస్‌గా కనిపిస్తూనే, మాస్‌ ప్రేక్షకుల హృదయాల్ని దోచేస్తుంటాడు. మాస్‌ ఇమేజ్‌కి కేరాఫ్‌ అనిపించే చిరంజీవి త్వరలోనే రాజకీయం ప్రధానంగా సాగే 'లూసిఫర్‌' రీమేక్‌ కోసం రంగంలోకి దిగనున్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రంలోనూ నాగార్జున చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. దర్శకులు సరికొత్త నేపథ్యాల్ని ఎంచుకుంటూ కథలు రాస్తుండడం.. అవి ప్రేక్షకుల అభిరుచులకి, తమ ఇమేజ్‌లకి తగ్గట్టుగా ఉండటంతో కథానాయకులూ ధైర్యంగా ముందుకొస్తున్నారు.

దేవాదాయ శాఖ అధికారిగా..

ఇదీ చదవండి:'ఎన్టీఆర్​తో ఒక్క సీన్​ అయినా చేస్తే చాలు!'

ABOUT THE AUTHOR

...view details