బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో పోరాడుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. గతంలోనూ ఇదే సమస్య ఎదురవగా, చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అది తిరగబెట్టినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ దర్శకుడి ఆరోగ్యం విషమం - nishikant kamat admitted
బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
![బాలీవుడ్ దర్శకుడి ఆరోగ్యం విషమం Filmmaker Nishikant Kamat hospitalised](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8384862-284-8384862-1597166460917.jpg)
నిషికాంత్
అజయ్ దేవగన్, శ్రియ నటించిన 'దృశ్యం', ఇర్ఫాన్ ఖాన్ 'మదారి', జాన్ అబ్రహం 'ఫోర్స్', 'రాకీ హ్యాండ్సమ్' లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు కామత్.
నిషికాంత్ తీసిన 'డొంబివాలి ఫాస్ట్',' లై భారీ' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరాఠీలోనూ ఈయన చాలా చిత్రాలు తెరకెక్కించారు. నటుడిగానూ మెప్పించారు.