మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న మూడో చిత్రం 'క్రాక్'. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్.. బుధవారం తిరిగి ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి షెడ్యూల్ జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
రామోజీ ఫిల్మ్‌సిటీలో రవితేజ 'క్రాక్'
రవితేజ 'క్రాక్' సినిమా షూటింగ్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశముంది.
క్రాక్
త్వరలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, అలీ, దేవీప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.