తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫిలింఫేర్ అవార్డు వేడుకలో అలియా,రణ్​బీర్ హవా! - విక్కీ కౌశల్,

64వ ఫిల్మ్​ఫేర్ అవార్డుల వేడుక ముంబయిలో వైభవంగా జరిగింది. రాజీ, అంధాధున్ సినిమాలు అత్యధికంగా చెరో 5 ఫిల్మ్ ఫేర్​లను కైవసం చేసుకున్నాయి. ఆలియా, రణ్​బీర్ ఈ ఈవెంట్​లో సందడి చేశారు.

ఫిల్మ్​ఫేర్ అవార్డులు

By

Published : Mar 24, 2019, 3:20 PM IST

Updated : Mar 24, 2019, 5:34 PM IST

64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ముంబయిలో జరిగింది. 2018లో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలకు ఈ అవార్డులను అందజేశారు. ఉత్తమ చిత్రంగా 'రాజీ' ఎంపికైంది. ఉత్తమ నటుడు విభాగంలో 'సంజూ' చిత్రానికి గాను రణ్​బీర్ కపూర్ అవార్డును అందుకోగా, ఉత్తమ నటిగా ఆలియా భట్​కి అవార్డు దక్కింది. అందాల నటి శ్రీదేవికి(మరణాంతరం)ఫిల్మ్​ఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది అవార్డు కమిటీ.

ప్రేమ పక్షులకు ఫిల్మ్​ఫేర్ అవార్డులు..

రణ్​బీర్- ఆలియా

రణ్​బీర్ కపూర్, ఆలియా భట్.. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో ఫిల్మ్​ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఫిలింఫేర్ అవార్డులందుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రేమికులకు పురస్కారాలొచ్చాయంటూ పలువురు విశేషంగా స్పందిస్తున్నారు!

విక్కీ కౌశల్
  • ఉత్తమ చిత్రం.... రాజీ
  • ఉత్తమ దర్శకుడు మేఘనా గుల్జార్ (రాజీ)
  • ఉత్తమ నటుడు రణ్​బీర్ కపూర్(సంజూ)
  • ఉత్తమ నటి.. ఆలియా భట్(రాజీ)
  • ఉత్తమ సహాయ నటుడు విక్కీ కౌశల్(సంజూ),గజ్​రాజ్(బదాయి హో)
  • ఉత్తమ సహాయ నటి సురేఖ సిక్రి(బదాయి హో)
  • క్రిటిక్స్ ఉత్తమ చిత్రం శ్రీరామ్ రాఘవన్(అంధాధున్)
  • క్రిటిక్స్ ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్)
  • క్రిటిక్స్ ఉత్తమ నటి నీనా గుప్తా(బదాయి హో)
  • ఉత్తమ నూతన నటుడు ఇషాన్ కట్టర్(ధడక్)
  • ఉత్తమ నూతన నటి సారా అలీ ఖాన్(కేదార్​నాథ్)
  • ఉత్తమ నూతన దర్శకుడు అమర్ కౌషిక్(స్త్రీ)
  • ఉత్తమ కథ అనుభవ్ సిన్హా(ముల్క్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
  • ఉత్తమ గేయరచయిత గుల్జార్(ఏ వతన్, రాజీ)
  • ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్(ఏ వతన్, రాజీ)
  • ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్(ఘుమర్​, పద్మావత్)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ రెడ్ చిల్లీస్(విఎఫ్​ఎక్స్​)జీరో

గతేడాది వాణిజ్యపరంగా విజయవంతమైన రాజీ, అంధాధున్ సినిమాలు అత్యధికంగా చెరో 5 ఫిలింఫేర్ అవార్డు​లను కైవసం చేసుకున్నాయి. బదాయ్ హో, పద్మావత్ చిత్రాలు నాలుగు చొప్పున పురస్కారాలు గెల్చుకున్నాయి. సినీ పరిశ్రమలో 50ఏళ్ల ప్రస్థానం విభాగంలో హేమమాలినికి ప్రత్యేక అవార్డు లభించింది. ఆర్​డీ బర్మన్ అవార్డు లైలా మజ్నూ చిత్రానికి గాను నీలాద్రి కుమార్ దక్కించుకున్నారు.










Last Updated : Mar 24, 2019, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details