మీకు తెలుసా? గాయని లతా మంగేష్కర్ ఫిల్మ్‌ఫేర్‌ని చేతిరుమాలులో పెట్టి ఇస్తేనే తీసుకున్నారట. ధర్మేంద్ర, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడిగా ఒక్కసారి కూడా అవార్డుని అందుకోలేదు. ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.
- ఫిల్మ్‌ఫేర్ అవార్డులని క్లేర్ పురస్కారాలని పిలుస్తారు. ప్రముఖ చిత్ర విమర్శకురాలు క్లేర్ మెండోన్కా 1954లో మరణించారు. ఆమె పేరు మీదుగా ఫిల్మ్‌ఫేర్ అని నామకరణం చేశారు.
1954 మార్చి 21న తొలిసారి ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను అందజేశారు. అప్పడు కేవలం నాలుగ విభాగాల్లోనే అవార్డుల్ని ఇచ్చారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీల్లోనే ఫిల్మ్‌ఫేర్ ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా 'దో బిగా జమీన్'కు తొలి అవార్డు దక్కింది.
- ఉత్తమ దర్శకుడిగా బిమాల్ రాయ్ 7 సార్లు ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు. దో భిగా జమీన్, పరిణీత, బిరాజ్ బహు, మధుమతి, సుజాత, పరాఖ్, బందిని చిత్రాలకు గాను ఆయనకు అవార్డు దక్కింది.
ఇప్పటి వరకు ఒక్కఏడాదిలో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందిన చిత్రం 'బ్లాక్'. 2005లో వచ్చిన ఈ సినిమా 11 పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటులు విభాగాలతో సహా 11 అవార్డులు కైవసం చేసుకుంది. దిల్వాలే దుల్హానియా లేజాయేంగే, దేవ్‌దాస్ చిత్రాలు 10 అవార్డులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి.
- షారుఖ్ అత్యధికంగా 14 ఫిల్మ్ఫేర్లు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా 8 పురస్కారాలు గెలుచుకుని, దిలీప్ కుమార్‌ని సమం చేశాడు. అనంతరం అమితాబ్ 5 ఫిల్మ్ఫేర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
- షారుఖ్, అమితాబ్ ఎక్కువ పురస్కారాలు గెలుచుకుంటే, అక్షయ్, గోవింద, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒక్కసారి కూడా ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అందుకోలేదు.