బాలీవుడ్ బిగ్గెస్ట్ ఈవెంట్ 65వ ఫిలింఫేర్ అవార్డు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలువురు బాలీవుడ్ స్టార్సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత కరణ్జోహర్తో పాటు నటుడు విక్కీ కౌశల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2019లో బాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు అందజేశారు.
ఉత్తమ చిత్రం గల్లీబాయ్...
ఈ ఏడాది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'గల్లీబాయ్' నిలిచింది. మొత్తం ఈ సినిమా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డు కోసం చిచోరే, మిషన్ మంగల్, ఉరి, వార్ పోటీపడ్డాయి.
ఉత్తమ నటీనటుల విభాగంలో రణ్‌వీర్ సింగ్, ఆలియా పురస్కారాలు సొంతం చేసుకున్నారు.
>>ఉత్తమ నటుడు కేటగిరీలో అక్షయ్ కుమార్ (కేసరి), ఆయుష్మాన్ ఖురానా (బాలా), హృతిక్ రోషన్ (సూపర్ 30), షాహిద్ కపూర్ (కబీర్ సింగ్), విక్కీ కౌశల్ (ఉరి) పోటీపడ్డారు.
>>ఉత్తమ నటి రేసులో కంగనా రనౌత్ (మణికర్ణిక), కరీనా కపూర్ (గుడ్ న్యూస్), ప్రియాంక చోప్రా (ద స్కై ఈజ్ పింక్), రాణీ ముఖర్జీ (మర్దానీ 2), విద్యా బాలన్ (మిషన్ మంగల్) నిలిచారు.
ఉత్తమ చిత్రం క్రిటిక్స్ అవార్డు రేసులో ఆర్టికల్ 15, సోంచారియా సంయుక్తంగా పురస్కారం అందుకున్నాయి. ఈ విభాగంలో మర్ద్ కో దర్ద్ నహీ హోతా, ఫొటోగ్రాఫ్, ద స్కై ఈజ్ పింక్ పోటీపడ్డాయి. ఉత్తమ దర్శకురాలిగా జోయా అక్తర్ (గల్లీబాయ్) నిలిచింది.
65వ ఫిలింఫేర్ అవార్డు విజేతలు వీరే...
- ఉత్తమ నటుడు - రణ్‌వీర్ సింగ్ (గల్లీబాయ్)
- ఉత్తమ నటి - ఆలియా భట్ (గల్లీబాయ్)
- ఉత్తమ చిత్రం - గల్లీ బాయ్
- ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు- జోయా అక్తర్ (గల్లీబాయ్)
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - అనుభవ్ సిన్హా (సోంచిరియా), అభిషేక్ (ఆర్టికల్ 15)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) - తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్ (సాండ్ కీ ఆంఖ్)
- ఉత్తమ సహాయ నటుడు - సిద్ధాంత్ ఛతుర్వేది (గల్లీబాయ్)
- ఉత్తమ సహాయనటి - అమృతా సుభాష్ (గల్లీబాయ్)
- ఉత్తమ సాహిత్యం - డివైన్, అంకుర్ తివారి (చిత్రం: గల్లీబాయ్, పాట: అప్నా టైమ్ ఆయేగా)
- ఉత్తమ సంగీతం- గల్లీబాయ్, కబీర్ సింగ్
- ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (చిత్రం: కళంక్, పాట: కళంక్ నహి)
- ఉత్తమ నేపథ్య గాయని - శిల్పారావ్ (చిత్రం: వార్, పాట: ఘుంగ్రూ)
- ఉత్తమ తొలి పరిచయం (నటుడు) - అభిమన్యు (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
- ఉత్తమ తొలి పరిచయం (దర్శకుడు)- ఆదిత్య ధర్ (ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్)
- ఉత్తమ తొలి పరిచయం (నటి) - అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ పత్నీ ఔర్ వో)
- ఉత్తమ మాటల రచయిత - విజయ్ మౌర్య (గల్లీబాయ్)
- ఉత్తమ యాక్షన్ - పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్)
- బెస్ట్ స్క్రీన్‌ప్లే- రీమా కగ్తి, జోయా అక్తర్ (గల్లీబాయ్)
- బెస్ట్ కొరియోగ్రాఫర్- రెమో డిసౌజా (చిత్రం: కళంక్, పాట: ఘర్ మోరే పర్దేశియా)
- బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీబాయ్)
- బెస్ట్ కాస్ట్యూమ్ - దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిరియా)
- బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జాయ్ ఓజా (గల్లీబాయ్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సుజన్నే కప్లాన్ (గల్లీబాయ్)
- బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
- బెస్ట్ వీఎఫ్ఎక్స్ - షెర్రీ బార్దా, విశాల్ ఆనంద్ (వార్)
- బెస్ట్ సౌండ్ డిజైన్ - విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
- జీవిత సాఫల్య పురస్కారం: రమేశ్ సిప్పీ
- ఎక్స్లెన్స్ ఇన్ సినిమా: గోవింద
- ఆర్డీ బర్మన్ అవార్డ్: సుష్వంత్ సచ్దేవ్ (ఉరి)