కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఆపరేషన్ విజయ్ పేరుతో జరిగిన ఈ పోరులో ఎందరో భారతీయ జవాన్లు అమరులయ్యారు. ట్విట్టర్లో వారికి నివాళి అర్పించారు పలువురు బాలీవుడ్ ప్రముఖులు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, లతా మంగేష్కర్, విక్కీ కౌశల్.. వారి సేవల్ని స్మరించుకున్నారు.
"మీ త్యాగాలకు మేము జోహార్లు అర్పిస్తున్నాం. మీ అలుపెరుగని పోరాటం మా అందరిని, దేశాన్ని రక్షించింది" -అమితాబ్ బచ్చన్, నటుడు
"నేడు కార్గిల్ విజయ్ దివస్. దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మన సైనికులకు శిరసువంచి నివాళి అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నా" -లతా మంగేష్కర్, గాయని
అమర జవాన్లకు వినూత్నంగా నివాళి అర్పించాడు అక్షయ్ కుమార్. వారి త్యాగాలను స్మరిస్తూ.. 'ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 2' పుస్తకాన్ని ఈరోజే చదవడం ప్రారంభించాను అని ట్వీట్ చేశాడు. 2016 మెరుపుదాడులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది.