తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ మృతిపై సినీలోకం దిగ్భ్రాంతి - Pranab Mukherjee news

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై హీరోలు చిరంజీవి, మహేశ్​బాబు, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సహా పలువురు​ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం భారత జాతికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Pranab
ప్రణబ్​

By

Published : Aug 31, 2020, 9:31 PM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో యావత్​ సినీపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. గాయకురాలు లతా మంగేష్కర్​, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్​ బాబు, మోహన్​లాల్​ , హీరోయిన్​ తాప్సీ సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఓ మంచి నాయకుడిని కోల్పోవడం భారత జాతికి తీరని లోటని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

"మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధించింది. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"

-లతా మంగేష్కర్, ప్రముఖ గాయని

"ఆయనతో కలిసి నేను నటించిన 'పింక్'​ సినిమా చూశాను. అనంతరం కలిసి డిన్నర్ కూడా​ చేశాం. ఆ మధురమైన సందర్భాన్ని మర్చిపోలేను. వుయ్​ మిస్​ యు సార్"

-తాప్సీ, హీరోయిన్​

"ఓ గొప్ప నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి"

-వరుణ్​ ధావన్​, బాలీవుడ్​ హీరో

ABOUT THE AUTHOR

...view details