సినీ పరిశ్రమలోని 24 ఫ్రేమ్స్‌కు సంబంధించిన శాఖలతో ఇండస్ట్రీలోని అనేక అంశాలపై టాలీవుడ్ ప్రముఖులు, ఆదివారం సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ జీఓల అమలు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్యలు, ఐదో ఆట, పైరసీ, కరోనా సమయంలో సినిమాహాళ్లకు విద్యుత్ రాయితీలు తదితర అంశాలను ఎజెండాగా తీసుకున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు.
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో నిర్మాత జి.అది శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. మరో మూడు నెలల తర్వాత సినీ పరిశ్రమలోని అన్ని క్రాఫ్ట్స్లతో మరోసారి సమావేశం ఉంటుందని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడించారు.
240 మందికి ఆహ్వానాలు పంపించింది. కానీ ఈ సమావేశానికి సుమారు 60 నుంచి 70 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. ఈ భేటీలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మైత్రీ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, ఛత్రపతి ప్రసాద్, అనిల్ సుంకర, ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు కొరటాల శివ, నటుడు మురళీమోహన్, చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్ , నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్ , అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైలర్‌లు, ప్రచార ఛార్జీలు, వీపీఎఫ్ ఛార్జీలకు సంబంధించి అన్ని మల్టీప్లెక్స్‌ల థియేటర్ మేనేజ్‌మెంట్ భరించాలని, సింగిల్ థియేటర్‌ల కోసం ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు చర్చించాలని, మద్దతు ఇవ్వాలి సమావేశంలో చర్చించారు. ఆన్‌లైన్ టిక్కెట్‌ల నుండి నిర్మాత, పంపిణీదారుకు షేర్ చేయాలని, ఛార్జీలు, నిబంధనలపై చర్చించనున్నట్లు వివిధ విభాగాల ప్రతినిధులు తెలిపారు. రెగ్యులర్ షోల మధ్యలో 5వ ఆట ప్రదర్శన ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ఫిల్మ్ నిర్మించే చిత్రాలకు డిజిటల్ ప్రొవైడింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడంతో పాటు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏర్పాటు చేయబోయే సబ్‌కమిటీలో దీనికి సంబంధించిన విధివిధానాలపై విస్తృత చర్చలు చేయాలని నిర్ణయించారు.