Bandla Ganesh Interview : 'అందుకే 'మా' ఎన్నికల బరిలో దిగా' - telangana top news
వరుస ట్వీట్లతో సంచలనం సృష్టించిన ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh Interview).. మా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరి ఇంతకీ.. ఆయన బరిలో ఎందుకు దిగారంటే..?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ తప్పుకుంటే తాను పోటీ చేయాలనే ఆలోచన విరమించుకుంటానని బండ్ల గణేశ్(Bandla Ganesh Interview) స్పష్టం చేశారు. జీవిత రాజశేఖర్‌ను తనకు తెలియకుండా ప్యానల్ లోకి తీసుకున్నారన్న బండ్ల గణేశ్... ఆమె ఉన్నందునే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే కచ్చితంగా 100 మంది కళాకారులకు రెండు పడకల గదుల ఇళ్లను తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బండ్ల గణేశ్(Bandla Ganesh Interview) తో మా ప్రతినిధి సతీశ్ ముఖాముఖి...