తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫైటర్' విడుదల తేదీ.. క్రేజీ అంకుల్స్ ప్రీ రిలీజ్ వేడుక - ఫైటర్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో లక్ష్య, క్రేజీ అంకుల్స్, ఫైటర్​, మళ్లీ మొదలైంది.. చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

movies updates
సినిమా కబుర్లు

By

Published : Aug 13, 2021, 8:56 PM IST

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'క్రేజీ అంకుల్స్‌'. ఇ.సత్తిబాబు దర్శకుడు. శ్రీవాస్‌ 2 క్రియేషన్స్‌ సారథ్యంలో గుడ్‌ ఫ్రెండ్స్‌, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతాన్ని అందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 14న హైదరాబాద్​లో జరగనుంది. ఆగస్టు 19న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.

క్రేజీ అంకుల్స్ ప్రి రిలీజ్ ఈవెంట్

'లక్ష్య' నుంచి గ్లింప్స్

నాగశౌర్య హీరోగా నటిస్తోన్న చిత్రం 'లక్ష్య'. విలువిద్య(ఆర్చరీ) కథతో తెలుగులో తీస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. కేతికా శర్మ హీరోయిన్. ఇందులో శౌర్య సిక్స్​ప్యాక్​తో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ కేతికా శర్మకు సంబంధించి ఓ గ్లింప్స్​ను చిత్రబృందం విడుదల చేసింది.

మళ్లీ మొదలైంది..

మళ్లీ మొదలైంది సినిమాలో నైనా గంగూలీ

సుమంత్, నైనా గంగూలీ హీరోహీరోయిన్లుగా చేస్తున్న చిత్రం 'మళ్లీ మొదలైంది'. కీర్తికుమార్​ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని హీరోయిన్ నైనా గంగూలీ.. పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఫైటర్ రిలీజ్ డేట్..

ఫైటర్ చిత్రబృందం

హృతిక్ రోషన్-దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'ఫైటర్'. ​హృతిక్​తో ఇప్పటికే 'వార్' తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మన త్రివిధ దళాలకు సెల్యూట్​ చేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరగనుంది. 2023 జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

షూటింగ్​ పూర్తి..

దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండె
దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేదిల చిత్రం షూటింగ్ పూర్తి

దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ముఖ్యపాత్రల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి శకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్నారు.

ఫాస్ట్ అండ్ ఫూరియస్..

ఫాస్ట్ అండ్ ఫూరియస్ కార్టూన్ వెబ్ సిరీస్

'ఫాస్ట్ అండ్ ఫూరియస్ స్పై రేసర్స్ సౌత్ పసిఫిక్' కార్టూన్ వెబ్​సిరీస్ రిలీజైంది. ఆగస్టు 13(శుక్రవారం) నుంచి నెట్​ఫ్లిక్స్​లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి:గోవాలో 'సర్కారు వారి పాట' యాక్షన్ హంగామా

ABOUT THE AUTHOR

...view details