'ఫిదా' సినిమాలోని 'వచ్చిండే... మెల్లామెల్లగ వచ్చిండే' పాట తెలంగాణ సాహిత్యం, సాయిపల్లవి డ్యాన్స్ మేళవింపు. అది మెచ్చిన నెటిజన్లు ఆ సాంగ్‌ను బాగా వీక్షించేశారు. ఇప్పుడు ఆ పాట అరుదైన రికార్డు నమోదుచేసింది. యూట్యూబ్ లో రెండు వందల మిలియన్లు (20 కోట్లు) వీక్షణలు సొంతం చేసుకుంది.
తెలంగాణ యాసకు కోట్లాది మంది 'ఫిదా' - sekhar kammula
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదా'. ఈ సినిమాలో 'వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే' పాట 200 మిలియన్ల మార్కు వీక్షణలు దాటేసింది.
తెలంగాణ యాసకు కోట్లాది అభిమానులు 'ఫిదా'
సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. తెలంగాణ గాయని మధుప్రియ ఆలపించింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం అందుకుంది.