తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్రాడ్​​ ఎడబాటు.. భరించలేకపోయా: ఏంజెలీనా - ఏంజెలినా జోలీ ప్రేమ కథ

బ్రాడ్​పిడ్​తో విడిపోయినపుడు ఎంతగానో బాధపడ్డానని చెప్పింది హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ. మనసులో చాలా కుంగిపోయానని తెలిపింది.

ఏంజెలినా జోలీ

By

Published : Oct 7, 2019, 6:12 AM IST

Updated : Oct 7, 2019, 7:50 AM IST

హాలీవుడ్ హాట్​కపుల్ ఏంజెలీనా జోలీ - బ్రాడ్​పిట్​.. విడిపోయి మూడేళ్లు కావొస్తున్నా.. తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఏంజెలీనా తన బ్రేకప్​పై స్పందించింది. బ్రాడ్​తో విడిపోయినపుడు ఎంతో బాధగా అనిపించిందని, మనసులో ఎంతో విచారించానని చెప్పింది.

"నా రాత ఎందుకు ఇలా ఉందో అర్థం కావట్లేదు. బ్రాడ్​తో బంధం నుంచి విడిపోయినపుడు ఎంతగానో బాధపడ్డా. నన్ను నేను తెలుసుకోలేనంతగా మారిపోయా. నిజంగా నా జీవితంలో అది క్లిష్టమైన పరిస్థితి. మనసులో చాలా కుంగిపోయా" - ఏంజెలీనా జోలీ, హాలీవుడ్​ నటి

ఏంజెలినా - బ్రాడ్​పిట్​

పదేళ్లపాటు బ్రాడ్​ - ఏంజెలీనా జోలీ సహజీవనం చేశారు. చివరికి 2014లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే కొద్ది కాలానికే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2016లో వారి బంధానికి చెక్ పడింది. విడాకులతో వేరయ్యారు.

ఇదీ చదవండి: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.1

Last Updated : Oct 7, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details