తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తిరిగి షూటింగ్​కు రావడం సంతోషం' - గంగూబాయ్ కతియావాడి సెట్లో ఆలియా భట్

బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా సెట్లో అడుగుపెట్టిన ఆలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Feels great to be reunited with Gangubai Kathiawadi team: Alia Bhatt
'గంగూబాయ్' సెట్లో ఆలియా భట్

By

Published : Dec 6, 2020, 11:08 AM IST

Updated : Dec 6, 2020, 12:22 PM IST

ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్​లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. ఇందులో వేశ్యగా కనిపించనుందీ భామ. కరోనా కారణంగా మార్చిలో నిలిచిపోయిన షూటింగ్​ ఇప్పుడు ప్రారంభమైంది. సెట్లో అడుగుపెట్టిన ఆలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఆలియా భట్

"సెట్లోకి తిరిగి అడుగుపెట్టడం గొప్పగా ఉంది. కానీ ఈ సమయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు పాటించాలి. ప్రతి నిమిషం గొప్పదే. ఈ పరిస్థితులను అందరం అంగీకరించాల్సిందే."

-ఆలియా భట్, బాలీవుడ్ నటి

అనుకోని పరిస్థితుల్లో చిన్నవయసులోనే వేశ్యగా మారిన గంగూబాయి తర్వాత క్రమంలో ముంబయి మాఫియా క్వీన్​గా ఎదిగిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం.

Last Updated : Dec 6, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details