తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిషేక్ విషయంలో బాధపడుతున్న అమితాబ్ - amitabh bachchan covid 19

తన కుమారుడు అభిషేక్ బచ్చన్ వేగంగా కోలుకుని, త్వరలో ఇంటికొస్తాడని భావిస్తున్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. ఈయనకు తాజాగా కరోనా నెగటివ్ వచ్చింది.

అభిషేక్ విషయంలో బాధపడుతున్న అమితాబ్
అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్

By

Published : Aug 3, 2020, 2:21 PM IST

తనను కరోనా బారి నుంచి తప్పించిన వైద్యులకు చాలా కృతజ్ఞతలు చెప్పారు బిగ్​బీ అమితాబ్ బచ్చన్. తన కుమారుడు అభిషేక్ ఇంకా ఆస్పత్రిలో ఉన్నాడని, అందుకు కొంచెం బాధగా ఉందని అన్నారు.

దాదాపు మూడు వారాల అనంతరం ఆదివారం(ఆగస్టు 2) చేసిన పరీక్షల్లో అమితాబ్​కు నెగటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి ఈయన ఇంటికి వచ్చేశారు.

"కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఎంతో హాయిగా ఉంది. కానీ అభిషేక్ ఇంకా ఆస్పత్రిలో ఉండటం బాధగా ఉంది. త్వరగా అతడు కోలుకుని, ఇంటికి వస్తాడనుకుంటున్నాను" అని అమితాబ్ చెప్పారు.

ఈ వైరస్​ను అరికట్టటంలో భాగంగా వైద్యులు నిరంతం శ్రమిస్తూనే ఉన్నారని బిగ్​బీ అన్నారు. కరోనా గురించి తమకు తెలిసిన సమాచారాన్ని ప్రపంచంలో పలు ఫార్మా సంస్థలకు చెబుతున్నారని తద్వారా మందు కనుగొనే అవకాశముందని అమితాబ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details