తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫాదర్స్ డే: 'నాన్నకు ప్రేమతో' టాలీవుడ్​ సెలబ్రిటీలు - చిరంజీవి ఫాదర్స్ డే

ఫాదర్స్ డే సందర్భంగా టాలీవుడ్​ సెలబ్రిటీలు.. ఆసక్తికర ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. నాన్నతో తమకున్న అనుబంధాల్ని పంచుకుంటున్నారు.

ఫాదర్స్ డే: టాలీవుడ్​ సెలబ్రిటీలు 'నాన్నకు ప్రేమతో'
టాలీవుడ్​ సెలబ్రిటీల ఫాదర్స్ డే:

By

Published : Jun 21, 2020, 12:15 PM IST

తన ఎదుగుదలలో ఎంతో తోడ్పాటు అందించిన నాన్నకు, ప్రేమతో 'ఫాదర్స్ డే' శుభాకాంక్షలు చెబుతున్నారు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు. వారితో తమకున్న అనుబంధాల్ని ఫొటోలు, ట్వీట్​ల రూపంలో పంచుకుంటున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్​స్టార్ మహేశ్​బాబు, ఇతర నటీనటులు ఉన్నారు. వీరి పోస్ట్​లకు అభిమానులు అదే రీతోలో లైకులు కొడుతూ 'పిృత దినోత్సవ' శుభాకాంక్షలు చెబుతున్నారు.

"చిరుతతో మా ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు... రెండు నాకు చాలా ఇష్టం. #HappyFathersDay" -మెగాస్టార్ చిరంజీవి

"ప్రేమ, దయ, శ్రద్ధ, దృఢత్వం, సున్నితత్వం, సంరక్షణ ఇలా అనేక పదాలతో మా నాన్న గురించి చెప్పగలను, చెబుతూనే ఉంటాను. నాతో ఎలా ఉన్నారో నేను మా పిల్లలతో అలానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. మీరే నా మార్గ నిర్దేశకులు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న" -సూపర్​స్టార్ మహేశ్​బాబు

"నాన్న కావడం గొప్ప అనుభూతి. నా పిల్లలను చూస్తుంటే ఇదే అనుభూతి కలుగుతోంది. దీనితో పాటే నా జీవితం సంపూర్ణమైనట్లు అనిపిస్తోంది. నా బలమైన లవ్లీ లిటిల్ వన్స్​కు థాంక్యూ" -గోపీచంద్, కథానాయకుడు

వీరితో పాటు ఇతర నటీనటులు ఫాదర్స్​ డే శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details