తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​' ఫ్రాంచైజీలో అదే చివరి చిత్రం! - ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వార్తలు

హాలీవుడ్​ యాక్షన్​ ఫ్రాంచైజీ 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​' సిరీస్​ 11వ భాగంతో ముగుస్తుందని దర్శకుడు జస్టిన్​ లీనే తెలిపారు. 'ఎఫ్​ 9' రూపొందిస్తున్న జస్టిన్​.. రాబోయే రెండు భాగాలకూ తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు.

Fast and Furious Series Will End the Run at 11 Films!
'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​' ఫ్రాంచైజీలో అదే చివరి చిత్రం

By

Published : Oct 22, 2020, 8:30 AM IST

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన యాక్షన్​ ఫ్రాంచైజీ సినిమాల్లో 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​'ది ప్రత్యేకస్థానం. ఈ సినిమా పేరెత్తగానే.. వేగంగా పరుగులు తీసే కార్లు.. కళ్లు చెదిరే ఫైట్లు.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్​ సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో మెదలుతాయి. ఇప్పటికే ఈ సిరీస్​లో 8 చిత్రాలు వచ్చి అలరించాయి. 'ఎఫ్​ 9' విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సిరీస్​ 11వ భాగంతో ముగుస్తుందని చిత్రబృందం ప్రకటించింది. 'ఎఫ్​ 9'కు దర్శకత్వం వహిస్తున్న జస్టిన్​ లీనే మిగిలిన భాగాలనూ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అక్కడితో ఈ కథ ముగుస్తుందన్నారు. ఈ చిత్రాలన్నింటినీ విన్​డిజిల్ నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details