తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' కొత్త ట్రైలర్ - hobbs and shaw movie

డ్వేన్ జాన్సన్, జేసన్ స్టాథమ్ హీరోలుగా నటిస్తున్న 'హాబ్స్ అండ్ షా' సినిమా ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కొత్త ట్రైలర్

By

Published : Apr 19, 2019, 9:13 AM IST

హాలీవుడ్​ యాక్షన్​ చిత్రాల్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీ ఒకటి. దీనికున్న క్రేజే వేరు. కారు రేస్​లతో ముడిపడిన ఈ చిత్రాలు ఇప్పటివరకు 8 వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. 'హాబ్స్ అండ్ షా' పేరుతో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది.

డ్వేన్ జాన్సన్, జేసన్ స్టాథమ్ హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్​గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. 2001లో తొలి చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' విడుదలైంది. ఇప్పటివరకు ఈ ఫ్రాంఛైజీలో అన్ని సినిమాలు కలిపి బాక్సీఫీస్ దగ్గర 5 బిలియన్​ డాలర్ల వసూళ్లు రాబట్టాయి.

ప్రస్తుతం వస్తున్న 'హాబ్స్ అండ్ షా'కు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details