తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నలుగురికీ కొత్తగా కనిపించడమే ఫ్యాషన్​' - ఫ్యాషన్​పై తమన్నా

ఫ్యాషన్​ అంటే కనిపించిన దుస్తులన్నీ వేసుకోవడం కాదని, నలుగురికీ కొత్తగా కనిపించడమని అంటోది సినీనటి తమన్నా. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తానని చెబుతోంది.

Tamanna_fashion
'ఫ్యాషన్​ అంటే నచ్చిన దుస్తులన్నీ వేసుకోవడం కాదు'

By

Published : Oct 28, 2020, 8:47 AM IST

ఫ్యాషన్​కు కేరాఫ్​ అడ్రస్​గా ఉండే సినీ తారలు ఫ్యాషన్​గా ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ష్యాషన్​గా కనిపించడం పట్ల తనదైన శైలిలో స్పందించింది.

"నాకు మొదటి నుంచీ ఫ్యాషన్‌పై చక్కటి అవగాహన ఉన్నప్పటికీ.. హిందీ చిత్రసీమకి వెళ్లాక మరిన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా. నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే కంటికి కనిపించిన దుస్తులన్నీ వేయడం కాదు. నలుగురికీ కొత్తగా కనిపించాలి. అది ధరించే వాళ్లకి సౌకర్యంగా ఉండాలి. మనం వేసుకున్న దుస్తులు అసౌకర్యంగా ఉంటే.. అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.నేనెప్పుడూ బయటకెళ్లినా.. సినీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈ విషయాల్ని కచ్చితంగా పాటిస్తుంటా " అని తమన్నా తెలిపింది.

ఇదీ చదవండి:'‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'

ABOUT THE AUTHOR

...view details