బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటిస్తున్న 'గుడ్‌లక్ జెర్రీ' షూటింగ్‌ను కొందరు రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చిత్రీకరణ జరపడానికి వీలులేదని హెచ్చరించారు.
తమ డిమాండ్‌కు యూనిట్ అంగీకారం తెలపడం వల్ల రైతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల ఎదుటే జరిగిందని ఓ వార్త సంస్థ తెలిపింది. ఈ సంఘటన తర్వాత రైతులకు మద్దతుగా ఇన్‌స్టాలో జాన్వీ కపూర్ ఓ పోస్టు పెట్టింది.