Faria Abdullah Accepted Green India Challenge: అడవులు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంపీ సంతోష్‌కుమార్ చేస్తున్న అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని సినీ కథానాయిక ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జాతిరత్నాలు ఫేమ్, నటి ఫరియా అబ్దుల్లా ఫిలింనగర్లో మొక్కలు నాటారు. టాలీవుడ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘన విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ నటి ఫరియా అబ్దుల్లా ఈ ఛాలెంజ్‌లో భాగమయ్యారు.
Faria Abdullah: మొక్కలు నాటిన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా - గ్రీన్ ఛాలెంజ్
Faria Abdullah Accepted Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎందరో ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు. తాజాగా టాలీవుడ్ కథానాయిక ఫరియా అబ్దుల్లా ఈ ఛాలెంజ్‌లో భాగమయ్యారు. ఫిలింనగర్లో మొక్కలు నాటారు.

Faria Abdullah: మొక్కలు నాటిన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఫరియా కోరారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ.. ఫరియా అబ్దుల్లాకి 'వృక్షవేదము' పుస్తకాన్ని బహుకరించారు.
మొక్కలు నాటిన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా
ఇవీ చదవండి: