బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ, బుధవారం ఉదయం మరణించినట్లు నటి పూజా భట్ ట్వీట్ చేసింది. ఇకపై కూడా ఆయన కుటుంబానికి అండగా నిలవాలని అభిమానులను కోరింది. అంతకుముందు ఫరాజ్ చికిత్స కోసం సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
అక్టోబరులో ఛాతీ, మెదడు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఫరాజ్ ఖాన్.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు సాయం చేసిన నటి పూజా భట్ ట్వీట్ చేసింది. స్పందించిన హీరో సల్మాన్‌ఖాన్ తనవంతు తోడ్పాటునందించారు.