బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్, దర్శకురాలు ఫరాఖాన్, మీర్జాపుర్ నటుడు విక్రాంత్ మస్సే.. సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి.
తన భర్త, దర్శకుడు శిరీష్ కుందర్ సహకారంతో ఇన్స్టా ఖాతాను తిరిగి పొందినట్లు ఫరా వెల్లడించారు. "గత సాయంత్రం నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. దాని నుంచి వచ్చే సందేశాలు ఎవరూ పట్టించుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఇన్స్టా ఖాతాను పునరుద్ధరించిన శిరీష్ కుందర్కు ధన్యవాదాలు" అని ఫరా పోస్ట్ పెట్టింది.