బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బుధవారం ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రం 'పఠాన్' ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందని పలువురు ఫ్యాన్స్ అడగ్గా.. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ అయిపోయిన తర్వాత తన సినిమా రిలీజ్ అవుతుందని చమత్కరించారు.
షారుక్ చివరిగా నటించిన చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 2018లో విడుదలై బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడేళ్లు తర్వాత 'పఠాన్' చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.
అయితే బుధవారం అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించిన షారుక్.. వారు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిచ్చారు. తాను నటించే కొత్త సినిమాలతో పాటు పుట్టినరోజు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
మీరు నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది?
షారుక్:ఇప్పటికే అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన చిత్రం విడుదల చేయాల్సిన సమయం వస్తుంది. కంగారు పడకండి.
గతేడాది యాష్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించే సినిమాను ప్రారంభించారు. దీనిపై అభిమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదేం?
షారుక్:అనౌన్స్మెంట్స్ అనేవి ఎయిర్పోర్ట్స్లో.. రైల్వే స్టేషన్లలో ఉంటాయి మై ఫ్రెండ్. సినిమాలకు అలా కాదు.. అలాంటి ఊహాగానాలతోనే సినిమాకు ప్రచారం లభిస్తుంది.