Paruchuri Venkateswarao latest photo: తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా కథల్ని, మాటల్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఈ సోదరులది. రచయితలకి స్టార్ హోదా దక్కిందంటే దానికి వీరు ఓ కారణమని చెప్పవచ్చు. పరుచూరి ద్వయంలో అగ్రజుడైన పరుచూరి వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా.. దర్శకుడిగా, నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది. అది చూసిన సినీప్రియులంతా ఆందోళనకు గురౌతున్నారు.
దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలలో పరుచూరి వెంకటేశ్వరరావుని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన రూపం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫొటో చూస్తుంటే ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.