'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. దేశవిదేశాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ పేరే ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ఇప్పుడు జపాన్‌లోని అతడి అభిమానులు ఏకంగా 'డార్లింగ్ ప్రభాస్' పేరిట మింట్ చాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్రజలు ఎగబడి మరి వాటిని కొనుక్కుంటున్నారని టాక్.
150 రోజులైనా ఆగని రచ్చ
'బాహుబలి' తర్వాత డార్లింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం మన దగ్గర అంత విజయాన్ని అందుకోకపోయినప్పటికీ విదేశాల్లో సిల్వర్ స్క్రీన్‌పై రచ్చ లేపుతుందట. ముఖ్యంగా జపాన్‌లో విడుదలై 150 రోజులు పూర్తి చేసుకున్న ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది. అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్'తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే 'ఆదిపురుష్' షూటింగ్లో పాల్గొనున్నారు 2022లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.
ఇది చూడండి 'ఎడారిలో తుపాను పుట్టించిన క్రికెటర్ సచిన్'