సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్‌కు ఎంతోమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు తారక్ కారు ట్రాఫిక్ జరిమానా చెల్లించాడు. అందుకు ప్రతిఫలంగా హీరో ముందు ఓ చిన్న వినతిని ఉంచాడు.
నెహ్రూ ఔటర్ రింగురోడ్డుపై ఓవర్‌స్పీడ్‌లో కారు నడిపినందుకు గాను ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌కు రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని.. ఆన్‌లైన్‌లో జరిమానా మొత్తాన్ని చెల్లించాడు. దీనిని తెలియజేస్తూ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు.
"తారక్ అన్నా.. నాతోపాటు నా స్నేహితులు కొంతమందికి మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా టికెట్లు ఇప్పించండి" అంటూ ఆ అభిమాని ఎన్టీఆర్ ముందు ఓ చిన్న విన్నపాన్ని ఉంచాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. ఆలియాభట్ సీతగా నటిస్తోంది. ఒలీవియా మోరీస్ ఎన్టీఆర్‌కు జోడీగా చేస్తోంది. ఇటీవల ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఇది చదవండి:బుల్లితెరపై మరోసారి వ్యాఖ్యాతగా తారక్?