ఇంటి నిండా నౌకర్లు, చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కే ఓ వ్యక్తి జాబ్ ఆఫర్ ఇచ్చి ఆశ్చర్యపర్చారు. తనకు వచ్చిన ఆ ఆఫర్ లెటర్‌ను బిగ్‌బీ స్వయంగా బ్లాగ్‌లో పంచుకున్నారు. కరోనా కారణంగా వయసు మీద పడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నిబంధనను ఉద్దేశిస్తూ అమితాబ్ తన కెరీర్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అమితాబ్‌కు జాబ్ ఆఫర్ చేసిన అభిమాని - అమితాబ్ బచ్చన్ వార్తలు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు జాబ్ ఆఫర్ చేసి ఆశ్చర్యపరిచారు ఓ అభిమాని. తాజాగా అందుకు సంబంధించిన వివరాలను బిగ్‌బీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.
అయితే అమితాబ్ తన అభిమాని నుంచి వచ్చిన జాబ్ ఆఫర్ వివరాలను బ్లాగులో పోస్టు చేశారు. "ఎప్పుడూ ఊహించనిదాన్ని కోరుకోండి. అతడి సృజన ఆకట్టుకుంది" అని రాసుకొచ్చారు. అలాగే తన ఉద్యోగానికి బీమా కూడా ఉందని చివరగా కామెంట్ చేశారు.
‘"ఎన్నో ఆందోళనలు మెదడును పాడుచేస్తున్నాయి. 65 అంతకంటే ఎక్కువ వయసున్న వారు షూటింగ్‌లకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తాజాగా దాన్ని 50 సంవత్సరాలకు కుదించింది" అంటూ తన బ్లాగులో ఆందోళన వ్యక్తం చేశారు అమితాబ్. అయితే 65 సంవత్సరాలు పైబడిన వారు షూటింగ్‌ల్లో పాల్గొనకూడదంటూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.