తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాజల్​ కోసం 60 లక్షలు పోగొట్టుకున్నాడు..! - Paris Paris

సినీ నటి కాజల్​ అగర్వాల్​ను కలవాలనుకున్న ఓ అభిమాని రూ. 60 లక్షలు పోగొట్టుకున్నాడు. అందాల భామను కలిసేందుకు ఓ నకిలీ వెబ్​సైట్​కు చెందిన మోసగాళ్ల చేతికి చిక్కి ఇబ్బందుల పాలయ్యాడు.

కాజల్​ కోసం 60 లక్షలు పోగొట్టుకున్నాడు..!

By

Published : Aug 2, 2019, 12:49 PM IST

నచ్చిన హీరోలు, హీరోయిన్లు అంటే చెయ్యి కోసుకునే అభిమానులు ఎంతోమంది. ముఖ్యంగా దక్షిణాదిన ఈ అభిమానం మరీ ఎక్కువ. కొంత మంది సినీ నటులకు దేవాలయాలు కట్టడం, పూజలు చేయడం చూశాం. ఇటీవల ఓ వ్యక్తి తనకు ఇష్టమైన నటి కాజల్​ అగర్వాల్​ను కలిసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. రూ. 60 లక్షలు పోగొట్టుకున్నాడు.

సినీ నటి కాజల్​ అగర్వాల్

తమిళనాడులోని రామంతపురానికి చెందిన ఓ అభిమాని.. కాజల్​ను కలవాలనుకున్నాడు. ఇందుకోసం నెట్టింట ఓ వెబ్​సైట్​లో వివరాలు చూశాడు. ఆ సైట్​ నిర్వాహకులతో మాట్లాడిన ఆ అభిమాని... హీరోయిన్​ వ్యక్తిగత సమాచారం కోసం తొలుత 50 వేలు చెల్లించాడు. తర్వాత మూడు దఫాలుగా 60 లక్షల వరకు ఆన్​లైన్​ ద్వారా నగదు బదిలీ చేశాడు.

ఎన్ని రోజులైనా నటి దగ్గరికి తీసుకెళ్లడం లేదని అడగ్గా... ఈ విషయం బయట చెప్తే ఆ అభిమాని నగ్న చిత్రాలు నెట్టింట పెడతామని బెదిరించారు. భారీగా డబ్బు పోగొట్టుకున్న వీరాభిమాని... ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయాడు. అతడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా... కోల్​కతాలో ఆచూకి లభించింది. బాధితుడి వివరాల మేరకు ఓ నిర్మాతపైన కేసు నమోదు చేశారు.

శర్వానంద్​కు జోడీగా 'రణరంగం'లో నటించింది కాజల్​. ఈ సినిమా ఆగస్టు​ 15న విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం 'ప్యారిస్​ ప్యారిస్​' చిత్రంలో నటిస్తోందీ నటి. ఈ సినిమా కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇవీ చూడండి...'సైరా'ను పోలిన సమీరా కూతురి పేరు...!

ABOUT THE AUTHOR

...view details