తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్​ లేరని తెలిసి.. ఐదుగురు అభిమానులు మృతి - పునీత్ రాజ్​కుమార్ న్యూస్

తమ అభిమాన హీరో పునీత్ రాజ్​కుమార్ మరణవార్త విని ఫ్యాన్స్​ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Fan died by heart attack after hearing Puneeth Death news
పునీత్ రాజ్​కుమార్-అభిమాని

By

Published : Oct 30, 2021, 10:09 AM IST

Updated : Oct 30, 2021, 8:06 PM IST

కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​ కుమార్ మరణం.. సహ నటీనటులతో పాటు అభిమానులకు తీవ్రశోకాన్ని మిగిల్చింది. అయితే పునీత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయిన కొంతమంది అభిమానులు కూడా మృతిచెందారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిలో కొంతమంది వివరాలు ఇవీ..

గుండెపోటుతో

కర్ణాటకలోని మరూర్​ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు.. హీరో పునీత్​ రాజ్​కుమార్ మరణ వార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. షాక్​తో అక్కడికక్కడే గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాణాలు వదిలేశాడు.

మునియప్ప

బెలగావి తాలుక్​ సింధోలి గ్రామంలోని కనకదాసా నగర్​లోని హనుమంత(33) అనే ఫ్యాన్​.. పునీత్​ ఇక లేరనే వార్త వినగానే గుండెపోటుతో చనిపోయారు.

ఉరివేసుకుని

బెలగావి జిల్లా, అథానీ మండలంలోని రాహుల్​(22) అనే అభిమానికి పునీత్​ అంటే దైవంతో సమానం. ఆయన కన్నుమూశారనే వార్త వినగానే పునీత్​ చిత్రపటానికి పూజించి దాని ముందే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. అక్టోబర్​ 29 రాత్రి జరిగిందీ ఘటన.

బ్లేడుతో చెయ్యి కోసుకుని

చమరజన్​నగర్​ జిల్లాలోని యలందూరు తాలుక్​ హొన్నూరు గ్రామంలోని గణేశ్​(22) బ్లేడుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరో ఇద్దరు విషం తాగి

రాయ్​చూర్​​ జిల్లాలోని బసవనగౌడ(28), మహ్మద్​ రఫి(28) కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం(అక్టోబర్​ 29) ఉదయం జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్ రాజ్​కుమార్​కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ పునీత్​ ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. ఈయన మృతి పట్ల పలువురు నటీనటులు, అభిమానులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details