తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనాక్షికి ఆన్​లైన్​లో మ్యారేజ్ ప్రపోజల్.. నటి ఏమందంటే? - సోనాక్షి సిన్హా తండ్రిపేరు

తీరికలేని షూటింగ్​ల నుంచి సెలవు తీసుకున్న స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అభిమానులతో ముచ్చటించేందుకు ఇన్​స్టా లైవ్​లోకి వచ్చింది. దీంతో ఫ్యాన్స్​ ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించారు. అయితే.. ఓ అభిమాని మాత్రం ఊహించని ప్రశ్న అడిగాడు. దానికి ఆ స్టార్ హీరోయిన్ స్పందన వింటే ఆశ్చర్యపోతారు.

సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా

By

Published : Aug 25, 2021, 4:58 PM IST

'నన్ను పెళ్లి చేసుకుంటారా?'అని అడిగిన ఓ నెటిజన్‌కు బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. సోనాక్షి.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూనే ఉంటుంది. ఎప్పటిలానే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' పేరిట ఓ సెషన్‌ను నిర్వహించింది.

ప్రశ్నలు అడిగిన వారందరికీ సరదాగా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ 'మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడగ్గా 'ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలాంటి ప్రపోజల్స్‌ని అంగీకరించట్లేదు' అని సోనాక్షి సమాధానం ఇచ్చింది.

సోనాక్షి సిన్హా యూట్యూబ్‌ హిస్టరీ
సోనాక్షి సిన్హా వాల్​పేపర్

మరికొందరు నెటిజన్లు తన ఫోన్‌ వాల్‌పేపర్‌ను, యూట్యూబ్‌ హిస్టరీని చూపించమని కోరగా సంబంధిత వివరాల్ని స్క్రీన్‌షాట్‌ తీసి వారితో పంచుకుంది. మరి సోనాక్షి ఏ వాల్‌పేపర్‌ సెట్‌ చేసుకుందో, యూట్యూబ్‌లో ఏం చూసిందో మీరూ చూసేయండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details