తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తనలోని మరో కళను బయటపెట్టిన బ్రహ్మానందం - cinema news

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న కమెడియన్ బ్రహ్మానందం.. తనలోని చిత్రకారుడ్ని బయటకు తీశారు. ప్రముఖ రచయిత శ్రీశ్రీ పెన్సిల్ స్కెచ్​ను​ గీసి ఆహా అనిపించారు.

SRI SRI PHOTO DRAW BY brahmi
హాస్య నటుడు బ్రహ్మానందం

By

Published : Apr 19, 2020, 4:25 PM IST

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.. తన అసమాన ప్రతిభతో ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో తనదైన శైలిలో నటించి, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. అలాంటి ఆయనలో ఓ అద్భుతమైన చిత్రకారుడు ఉన్నారని తాజాగా నిరూపించారు. లాక్​డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న బ్రహ్మీ.. ప్రముఖ రచయిత శ్రీశ్రీ చిత్రాన్ని పెన్సిల్​తో ఆకట్టుకునేలా గీశారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఆయన కుమారుడు గౌతమ్, సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అవి ఇప్పుడు వైరల్​గా మారాయి.

బ్రహ్మానందం గీసిన శ్రీశ్రీ చిత్రం

ప్రస్తుతం లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న పలువురు సెలబ్రిటీలు.. వివిధ రకాలు వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. కరోనాను అరికట్టటంలో భాగంగా ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details