Prabhas Marriage Date: ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఏకైక నటుడు ప్రభాస్. ఆయన చేస్తున్న సినిమాలన్నింటికీ బడ్జెట్ కలిపితే రూ.1000కోట్లకు పైమాటే. అలాంటి స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా? అని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' చిత్రాల తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు గతంలో ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవలే మరోసారి ఆయన పెళ్లి విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas Marriage Date: 'ప్రభాస్ పెళ్లి తేదీ అదే' - ప్రభాస్
Prabhas Marriage Date: దేశవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. పాన్ఇండియా స్థాయిలో ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు పెళ్లి కబురు కోసమూ ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్ కుమార్. డార్లింగ్ పెళ్లి ఈ ఏడాదిలోనే జరుగుతుందని అన్నారు.
"నటుడు ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. ఇది పాన్ ఇండియా స్టార్ విషయంలో నా జ్యోతిష్యం" అని చెప్పుకొచ్చారు. మరి వినోద్ కుమార్ చెప్పినట్లే ప్రభాస్ పెళ్లి జరుగుతుందా? లేదా..? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మరోవైపు ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయన హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. వీటితో పాటు ప్రభాస్ 'సలార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్టు కె' చిత్రాలతో పాటు మరో చిన్న సినిమాలోనూ నటించనున్నారు.