బెంగళూరులో ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవో ఏకే రావు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. తన తండ్రిది కచ్చితంగా హత్యేనని హరిణి అనుమానం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏకే రావు.. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వారం రోజులుగా ఆయన కుటుంబసభ్యులతో సహా అదృశ్యమయ్యారు.