తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో రానున్న "ఫలక్​నుమాదాస్"

"ఫలక్​నుమాదాస్"​ సినిమా ప్రచారచిత్రాన్ని చిత్ర బృందం​ విడుదల చేసింది.

టీజర్​ విడుదల

By

Published : Feb 14, 2019, 6:09 AM IST

Updated : Feb 14, 2019, 7:41 AM IST

టీజర్​ విడుదల
టాలీవుడ్​లో మరో వైవిధ్యమైన చిత్రం 'ఫలక్​నుమా దాస్' తెరపైకి రాబోతుంది. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉత్తేజ్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసు అధికారిగా నటించిన ఈ సినిమా టీజర్​ను చిత్ర బృందం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసింది.

పాతబస్తీలోని ఫలక్​నుమా పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలు, వ్యక్తుల వ్యవహార శైలి నేపథ్యంగా ఈ చిత్రం సాగనుంది. కరాటే రాజు సమర్పణలో జయచంద్ర, గోపాల్ ఉపాధ్యాయ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Feb 14, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details