జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్.. 'పుష్ప' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహాద్. తన పాత్ర గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారాయన.
"దర్శకుడు సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతగానో మెప్పించింది. మరోవైపు కమల్ హాసన్ నటిస్తున్న 'విక్రమ్' సినిమాలోనూ నాకు అవకాశం వచ్చింది."