తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమాలో పోలీస్​ ఆఫీసర్​గా ఫహాద్​! - కమల్​ హాసన్​ విక్రమ్​

లోకనాయకుడు కమల్​ హాసన్​ - లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో 'విక్రమ్'​ సినిమా రూపొందుతోంది. ఇందులో మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఓ కీలకపాత్రలో నటించనున్నారని ఇదివరకే ప్రకటన వచ్చింది. అయితే ఆయన పోషించే పాత్రపై ఓ ఆసక్తికర అప్​డేట్​ బయటకొచ్చిందని కోలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Fahad Fazil Doing a police officer role in Kamal Haasan's Vikram movie
ఆ సినిమాలో పోలీస్​ ఆఫీసర్​గా ఫహాద్​!

By

Published : May 24, 2021, 4:09 PM IST

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్​ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి 'విక్రమ్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఇందులో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దీంట్లో ఆయన పోషించబోయే పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఫహాద్‌ ఈ చిత్రంలో అవినీతిపరుడైన పోలీసు అధికారిగా కనిపించనున్నారని సమాచారం. జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి సహాయపడే పోలీసుగా ఆయన పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని వర్గాల్లో మాత్రం ఆయన ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి..అల్లు అర్హ.. హీరోయిన్​కు ఏమాత్రం తీసిపోదు!

ABOUT THE AUTHOR

...view details