ప్రతి ఒక్కరు వ్యాయామంపై దృష్టి పెట్టాలని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. అన్నింటికి సమయం కేటాయించే మనం వ్యాయామన్ని నిర్లక్ష్యం చేయటం సరికాదన్నారు. శరీరానికి శ్రమ ఇవ్వకపోతే ... అది మనల్ని శిక్షిస్తుందన్నారు. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎఫ్45 జిమ్ సెంటర్‌ను యువ హీరో సుశాంత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
శారీరక శ్రమతోనే ఆరోగ్యం, అందం: సినీనటుడు జగపతిబాబు - వ్యాయామంపై జగపతిబాబు కమెంట్స్
హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎఫ్45 జిమ్ సెంటర్‌ను ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు, యువ హీరో సుశాంత్‌తో కలిసి ప్రారంభించారు. జిమ్‌లో కాసేపు వ్యాయామం చేశారు. ప్రతిఒక్కరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.
శారీరక శ్రమ చాలా అవసరం: జగపతిబాబు
గతంలో ఫీట్‌నెస్ కోసం వ్యాయామం ఎక్కువగా చేశానని... ప్రస్తుతం యోగా మాత్రమే చేస్తున్నట్లు జగపతిబాబు తెలిపారు. రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం, యోగా ప్రతిఒక్కరు చేయాలన్నారు. ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరమన్నారు. ఇంటర్‌ను నుంచి ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టినట్లు యువ హీరో సుశాంత్ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్ తప్పని సారిగా వినియోగించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి :ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇప్పుడు పోతే వార్త : కేటీఆర్