గతేడాది విడుదలై, తెలుగు ప్రేక్షకులను అలరించిన 'ఎఫ్2' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీస్టారర్‌కు జాతీయ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
2019కు గాను వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ బుధవారం ఇండియన్ పనోరమ విభాగంలో అవార్డులను ప్రకటించింది. ఇందులో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా 'ఎఫ్2' నిలిచింది.