ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మురిసిపోయారు. ఆ పిల్లాడిని ట్విట్టర్ ద్వారా ఆశీర్వదించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
మోదీజీ... మోదీజీ...
ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మురిసిపోయారు. ఆ పిల్లాడిని ట్విట్టర్ ద్వారా ఆశీర్వదించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
మోదీజీ... మోదీజీ...
ప్రముఖ నటి గుల్ పనాగ్.. తన కుమారుడు నిహాల్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ఆ వీడియోలో ఉన్న ఓ పుస్తకం కవర్ మీద మోదీ చిత్రం ఉంది. ఆ చిత్రం ఎవరిదని తల్లి అడగగా.. 'మోదీజీ.. మోదీజీ' అంటూ ముద్దుగా సమాధానమిచ్చాడు నిహాల్. మోదీజీని నిహాల్ ఎంతో సులభంగా గుర్తించగలడని.. అందుకే ఈ వీడియోను పోస్ట్ చేసినట్టు తెలిపింది గుల్ పనాగ్. ప్రధానిని టాగ్ చేసింది.
పనాగ్ ట్వీట్‌కు ఎంతో సంతోషించారు మోదీ. పనాగ్ లాంటి గురువు, మార్గనిర్దేశకురాలు ఉండటం వల్ల నిహాల్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు.
"చాలా ముద్దుగా ఉంది. నిహాల్‌కు నా ఆశీర్వాదాలు తెలపండి. తాను అనుకున్న దానిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. మీలో అతడికి ఓ గొప్ప గురువు, మార్గనిర్దేశకురాలు కనపడతారని నేను విశ్వసిస్తున్నా."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.