తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిజాలు తెలియాలి.. ఫ్లకార్డుతో సుశాంత్ సోదరి నిరసన - సుశాంత్​ మృతి కేసు

యువ నటుడు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించి నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు అతడి సోదరి శ్వేతాసింగ్​. సుశాంత్​ మరణానికి సంబంధించి నిజాలు తెలుసుకోవ​డం కోసమే ఈ న్యాయపోరాటం చేస్తున్నామని అన్నారు.

Sushant Singh
సుశాంత్​ సింగ్​

By

Published : Aug 13, 2020, 1:15 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ మృతి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని అతడి సోదరి శ్వేతాసింగ్‌ డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి తన సోదరుడి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయానికి సంబంధించి నిజాలు తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని వెల్లడించారు. ప్లకార్డ్​ పట్టుకుని నిరసన చెబుతున్న ఓ వీడియోను ఈమె ట్వీట్ చేశారు.

సుశాంత్‌ మరణానికి సంబంధించి నిజాలు తెలుసుకోవడానికే తప్ప మరేదో ఆశించి తాము సీబీఐ విచారణ కోరలేదని శ్వేతా సింగ్ స్పష్టం చేశారు. వాస్తవాలు బయటపడినపుడే నటుడు అభిమానులు, తమ కుటుంబసభ్యులు ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పారు.

జూన్​ 14న

జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక మలుపుల అనంతరం అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఆమెపై సుశాంత్‌ కుటుంబ సభ్యులు బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం తమ కుమారుడిని ఉపయోగించుకుని మోసం చేసిందని అన్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. నటుడు మృతి కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా బిహార్‌ సర్కారు కేంద్రాన్ని కోరడంపై సానుకూల స్పందన వచ్చింది.

ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదం నెలకొంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును ముమ్మరంగా విచారిస్తున్నారు. వృత్తిపరంగా, కుటంబసభ్యుల వాంగ్ములాలను సేకరిస్తున్నారు.

ఇది చూడండి ఆ దర్శకుడి సినిమా సెట్​లో కుర్చీలకు నో ఛాన్స్

ABOUT THE AUTHOR

...view details