తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టక్​ జగదీశ్' ఓటీటీ విడుదలపై​ ఎగ్జిబిటర్ల ఆందోళన - ఎగ్జిబిటర్ల ఆగ్రహం టక్​ జగదీష్

టక్​ జగదీశ్​ ఓటీటీలో విడుదల కావడంపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదల చేయడటం నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు భవిష్యత్​లో తీరని నష్టాన్ని చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

tuck jagadish movie updates
'టక్​ జగదీశ్' ఓటీటీ విడుదలపై​ ఎగ్జిబిటర్ల ఆందోళన..

By

Published : Aug 20, 2021, 9:41 PM IST

నేచురల్​ స్టార్​ నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదలకు సన్నాహాలు చేస్తుండటంపై తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ థియేటర్​లో విడుదలవుతుండగా అదే రోజు టక్ జగదీశ్​ను ఓటీటీలో విడుదల చేస్తుండటం పట్ల ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. పండుగల సమయంలో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదల చేయటం నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు భవిష్యత్​లో తీరని నష్టాన్ని చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిల్మ్​ ఛాంబర్​లో ఎగ్జిబిటర్లు

ఈ సందర్భంగా తెలంగాణ సినిమా థియేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్​లో సమావేశమైన ఎగ్జిబిటర్లంతా థియేటర్ లో విడుదలవుతున్న లవ్ స్టోరీకి ఏకగ్రీవంగా మద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు ఓటీటీతో చర్చించి ఎగ్జిబిటర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :నాని సినిమాపై అసత్య ప్రచారం.. స్పందించిన టీమ్‌

ABOUT THE AUTHOR

...view details