తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్(కర్ణుడు) ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'మహావీర్ కర్ణ'.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విక్రమ్ తప్పుకున్నట్లు చిత్రానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఇప్పుడు ఆ పాత్రలో ఓ బాలీవుడ్ నటుడ్ని తీసుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను ఫిబ్రవరి 23న విడుదల చేసింది చిత్రబృందం.
'మహావీర్ కర్ణ' నుంచి తప్పుకున్న విక్రమ్!
భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న 'మహావీర్ కర్ణ' సినిమా నుంచి చియాన్ విక్రమ్ తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయన పాత్రకు ఓ బాలీవుడ్ నటుడిని తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది.
విక్రమ్
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్ సెల్వన్'లోనూ విక్రమ్ నటిస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: కర్ణుడిగా విల్లు ఎక్కుపెట్టిన చియాన్ విక్రమ్