తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రెగ్నెన్సీపై స్పందించిన కాజల్​ అగర్వాల్​

కొద్ది రోజులుగా హీరోయిన్​ కాజల్​ అగర్వాల్(kajal agarwal latest news)​ గర్భం దాల్చిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ దీనిపై స్పందించింది(kajal agarwal updates).

kajol
కాజల్​

By

Published : Nov 9, 2021, 9:35 AM IST

Updated : Nov 9, 2021, 10:22 AM IST

గతేడాది అక్టోబరులో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను(gautam kitchlu kajal aggarwal) పెళ్లి చేసుకున్న స్టార్​ హీరోయిన్​ కాజల్.. ప్రస్తుతం గర్భంతో ఉందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది(kajal agarwal latest news). తాజాగా ఈ విషయమై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. "ఈ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సరైన సమయంలో దీని గురించి స్పందిస్తా" అని చెప్పింది(kajal agarwal updates).

కాజల్​ చెల్లిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని చిత్రాల్లో నటించిన నిషా అగర్వాల్​(kajal sister marriage) ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్​బై చెప్పింది. ఆమెకు ఓ అబ్బాయి. అయితే కాజల్ కూడా​ త్వరగా తల్లి అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తెలిపింది నిషా. ఈ విషయమై స్పందించిన 'చందమామ' భామ.. "ఈ విషయం నన్ను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. కానీ అదే సమయంలో ఒత్తిడికి కూడా లోనవుతా. నిషా జీవితం ఎలా మార్పు చెందుతూ వచ్చిందో చూశా. ఆమె జీవితానికి పరిపూర్ణత వచ్చింది. తల్లిగా మారడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో సెల్ఫ్​ రియలైజేషన్​ అవుతారని అనుకుంటా. అయినా నిషా కుమారుడుతో ఉన్నప్పుడు నన్ను నేను ఓ తల్లిగా భావిస్తా. ఇప్పుడు మా ఇంట్లో మియా(పెంపుడు కుక్క) వచ్చాక కూడా.. నేను, గౌతమ్​ తల్లిదండ్రులుగా ఫీల్​ అవుతున్నాం. నాకు సొంత పిల్లలు పుట్టినప్పుడు ఈ ఎమోషన్​ ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటా" అని కాజల్​ చెప్పింది.

త్వరలోనే కాజల్.. చిరంజీవి నటించిన​ 'ఆచార్య'(acharya movie kajal) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే 'హే సినామికా', 'ఘోష్టి', 'ఉమ', 'ఇండియన్​ 2', 'ప్యారిస్​ ప్యారిస్​' సినిమాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: కాజల్​ ఫిట్​నెస్​ సీక్రెట్​ తెలుసా?

Last Updated : Nov 9, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details