తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్కు తప్పనిసరిగా ధరించండి: మహేశ్ - Mahesh Babu request to people

మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అంటున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. నకిలీ వార్తలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. లాక్​డౌన్ కారణంగా ఇంటివద్దే కుటుంబంతో గడుపుతోన్న ప్రిన్స్ తాజాగా సామాజిక మధ్యమాల్లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

మహేశ్
మహేశ్

By

Published : May 22, 2020, 6:53 PM IST

"ప్రస్తుతం మనం సాధారణ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. దశలవారిగా లాక్‌డౌన్‌ పరిమిత సడలింపులతో అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ముందుకు సాగాలి" అంటున్నారు సినీ నటుడు మహేశ్ బాబు.

"సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించాలి. మీరు ఇంటి బయటకు వచ్చిన ప్రతిసారి కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించండి. మనల్ని మనం రక్షించుకోవడానికి భౌతిక దూరం పాటించండి. ఇది మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో మనం ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంది. భయాందోళన కలిగించే వార్తలకు దూరంగా ఉంటే మంచిది. నకిలీ వార్తలు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. త్వరలోనే మనం సాధారణ జీవితాల్లోకి వచ్చేస్తాం. నేను మాస్క్ ధరించాను. మరి మీరు?"

-మహేశ్ ట్వీట్

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ మహేశ్ బాబు.. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలను నమ్రతా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టి నవ్విస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details